మండేపల్లి క్రికెట్ టోర్నీలో అశోక్ లెవన్ జట్టుకు ప్రథమ స్థానం

16-10-2026 | 11:22pm

తంగళ్ళపల్లి,అక్టోబర్ 16 (విజయ క్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో దేవి నవరాత్రుల(Devi Navaratrulu) సందర్భంగా నిర్వహించిన వీహెచ్‌సీ సీజన్‌-2 మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్(Cricket Tournament) ముగిసింది. నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఆరు జట్లు పాల్గొనగా, అశోక్ లెవన్(Ashok Eleven) జట్టు మొదటి స్థానం, రాఖీ లెవన్ జట్టు రెండో స్థానం సాధించాయి.

ప్రథమ బహుమతిగా రూ.10 వేల నగదును జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్మని రామలింగారెడ్డి అందజేయగా, ద్వితీయ బహుమతిగా రూ.7 వేల నగదును మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గనగోని సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

మరిన్ని వార్తలు