రంగపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని(Mancherial town) రంగపేటలో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డెన్ సెర్చ్(Police Cordon and Search) నిర్వహించి ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను సీజ్(Seize two-wheelers) చేశారు. మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు(Mancherial Town Inspector Pramod Rao) ఆధ్వర్యంలో పోలీసులు అనుమానితులు, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, యువతకు గంజాయి, మత్తు పదార్థాలు(Intoxicating substances), జూదం, సైబర్ నేరాలు(Cybercrimes), ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కోరుతూ వాలీబాల్, నెట్ను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.