అమ్మవారి మండపాల్లో ప్రత్యేక పూజలు

16-10-2026 | 11:07pm

మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్

మహబూబ్‌నగర్ (విజయక్రాంతి) : నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్(Anand Kumar Goud) గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించారు. బీకే రెడ్డి కాలనీ, అయోధ్య నగర్, శ్రీరామ కాలనీ, పాలకొండ తదితర ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించుకుని పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం వంగ రాజశేఖర్ గౌడ్ సోదరుడు కృష్ణ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదిర శివశంకర్, శివరాజ్, సురేష్, గోటూరి రాజు, కర్ణం రవి, పాలకొండ శీను, మూస నరేందర్, వరుణ్, లడ్డు, ఉషన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు