అంగరంగ వైభవంగా అట్ల బతుకమ్మ సంబరాలు

16-10-2026 | 11:14pm

భిక్కనూర్, అక్టోబర్‌ 16 (విజయ క్రాంతి): భిక్కనూర్‌ మండలం(Bhikkanur Mandal) పెద్దమల్లారెడ్డి లో అట్ల బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) మహిళలు ఘనంగా నిర్వహించారు. రెడ్డి కాలనీ మహిళలు ఒకే రకమైన చీరలు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయ పాటలు(Traditional songs) పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామాల్లోని చెరువుల వద్దకు చేరుకుని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పండుగ వేడుకలతో గ్రామాల్లో సందడి నెలకొంది.

మరిన్ని వార్తలు