పేద ప్రజలకు సేవ చేయడం అభినందనీయం

11-10-2026 | 09:37pm

హనుమకొండ, అక్టోబర్ 11(విజయక్రాంతి): వైద్యులు పేద ప్రజలకు సేవ చేయడం అభినందనీయ మని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Warangal West MLA Naini Rajender Reddy) అన్నారు. హనుమకొండ 51వ డివిజన్ లో ఉచిత మెగా వైద్య శిబిరం(Free Mega Medical Camp) నాయిని రాజేందర్ రెడ్డి సహకారంతో బికే రెడ్డి కాలనీ రెసిడెంట్  అసోసియేషన్, ఇషా హాస్పిటల్(Isha Hospital) ఆధ్వర్యంలో నాయిని లక్ష్మారెడ్డి, వినయ్ నారాయణ రెడ్డి సహకారంతో నిర్వహించారు.

మెగా వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రముఖ డాక్టర్లు ప్రజాసేవ చేయడం అభినందనీయమని,వారికి ఎల్లప్పుడూ ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామన్నారు. మెగా వైద్య శిబిరంలో ప్రముఖ డాక్టర్లు శ్రీరామ్ రెడ్డి, రామ్ నరసింహ రెడ్డి,అశోక్ రెడ్డి, స్వరాజ్యలక్ష్మి, సురేష్,ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి సేవలందించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మంది పాల్గొని వారి ఆరోగ్య సమస్యలు పరీక్షించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ కరీం, సాయిరాం యాదవ్, డివిజన్ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, నేపాల్ రెడ్డి, అబ్బరబోయిన నగేష్, వెంకటేశ్వర్లు, నాగరాజు, నవీద్, నజీమున్నిసా, సైఫ్ జాఫర్,అఖిల్, అక్షయ్, వేల్పుల అనిల్,స్వాతి, సబితా రెడ్డి, గీత, ప్రియాంక, భాగ్యలక్ష్మి,వినోద తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు