మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణ

21-09-2026 | 05:00am

అపురూప అపార్ట్మెంట్లో గణనాథునికి ఎమ్మెల్యే కాలేరు ప్రత్యేక పూజలు

అంబర్ పేట, సెప్టెంబర్20(విజయక్రాంతి): బాగ్ డివిజన్లోని అపురూప అపార్ట్మెంట్లో ఆదివారం నిర్వహించిన గణేష్ పూజా కార్యక్రమానికి(Ganesh Puja program) అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్(Amberpet MLA Kaleru Venkatesh) హాజరయ్యారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అపార్ట్మెంట్ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు(Happy Vinayaka Chavithi) తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించా రు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసు లు, స్థానికులు పాల్గొన్నారు.

మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణ

ముషీరాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): గత14 ఏళ్లుగా “మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” నినాదంతో మట్టి గణపతి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రపంచ ప ర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షుడు సిహెచ్. భద్ర తెలిపారు. నాగోలు బండ్లగూడలోని ఏసీఈ అజంతా అపార్ట్మెంట్ వాసులు గత ఆరేళ్లుగా మట్టి గణపతిని పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి బెస్ట్ ఎకో ఫ్రెండ్లీ గణపతి అవార్డు అందజేసినట్లు చె ప్పారు.

బషీర్బాగ్లో సిహెచ్. భద్ర మాట్లాడు తూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నదు లు, చెరువులు, సముద్రాల్లో నిమజ్జనం చే యడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోందన్నారు. అజంతా అపార్ట్మెంట్ అధ్యక్షు డు కొండలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణహిత కార్యక్రమానికి ఈ అవార్డు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజా మనోజ్, హై ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు రవీందర్, సంస్థ ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి కోనేటి, కోశాధికారి రిజ్వాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందరిపై ఉండాలి

మల్కాజిగిరి, సెప్టెంబర్ 20, (విజయక్రాంతి) : ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మ ల్కాజిగిరి నియోజక వర్గం ప్రజలు అందరిపై ఉండాలని ’సర్’ మల్కాజిగిరి అబ్జర్వర్ సమీ ర్ కౌశల్ అన్నారు. ఆదివారం ఆయన మీర్జాలగూడ డివిజన్ పరిధిలోని వీణా పాణి నగర్ లో కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి బీ బ్లాక్ అధ్య క్షుడు తుమ్మట్ల వెంకటేష్ యాదవ్ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించారు. ప్రత్యేక పూజకు హజరైన ఆయనను, నిర్వహకులు శాలువాతో ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీ కే శ్రీనివాస్, పీవీ సత్య నారాయణ, సత్యమూర్తి, బాబు, సత్యనారాయణ, బ్రహ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి,రోజా రమణి, కనకలక్ష్మి పుష్ప లత,శంకర్ రావు, రామకృష్ణ, రాము, సాయి తదితరులు పాల్గొన్నారు..

శిల్పి కాలనీలో చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు

అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 20: పెద్ద అంబర్ పేట్ డివిజన్ పరిధి శిల్పి కాలనీలో ఆదివారం కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గణపతి ఉత్సవాల సందర్భంగా నిర్వ హించిన ఈ పోటీల్లో కాలనీకి చెందిన చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. గణనాథుడి చిత్రాలతో పా టు వివిధ అంశాలపై చిన్నారులు వేసిన చి త్రాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ని ర్వాహకులు మాట్లాడుతూ.. చిన్నారుల్లో సృ జనాత్మకతను, కళాత్మక ప్రతిభను ప్రోత్స హిం చేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న చిన్నారులను అభినందించి, విజేతలకు బ హుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, యువకులు, మహిళలు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గణనాథుడి లడ్డూ రూ.1.38  లక్షలకు కైవసం

ఆదిభట్ల: సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ ఎస్వీ ఎన్క్లేవ్ (ఏ, బీ, సీ)లో వినా యక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఉత్సవాల్లో భాగంగా నిర్వహిం చిన లడ్డూ వేలం పాటలో పెన్ కౌంటర్ సీఎండీ ఆనంద్కుమార్, అపర్ణ దంపతులు రూ.1.38 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.నవరాత్రులు భక్తుల పూజలు అందు కున్న లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందని దంపతులు తెలిపారు. భక్తిశ్ర ద్ధలతో నిర్వహించిన పూజలకు గుర్తుగా ల డ్డూను కైవసం చేసుకున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు