బంగ్లాపై భారీ విజయం.. ఫైనల్‌కు భారత్

20-09-2026 | 02:13pm

ఆసియా క్రీడల మహిళల టీ20 క్రికెట్ ఫైనల్‌లోకి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్(Defending champion India) వరుసగా రెండోసారి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్(Bangladesh vs India) తో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో 114 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు చేరడం ద్వారా మహిళల క్రికెట్ జట్టు మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. 196 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తరఫున షెఫాలీ వర్మ(Shafali Verma) కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి తన తొలి T20I సెంచరీని సాధించడంతో, జట్టు 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో నందినీ శర్మ, దీప్తీ శర్మ చెరో మూడు వికెట్లు, శ్రీచరణి 2, క్రాంతి, శ్రేయాంక చెరో వికెట్ తీసుకున్నారు. ఈనెల 22న ఫైనల్ లో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది.


మరిన్ని వార్తలు