టీఆర్ఎస్ వస్తే.. వైద్యం ఫ్రీ అంటున్న కవిత!

20-09-2026 | 04:53pm

వికారాబాద్: కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ(TRS Public Meeting) నిర్వహించింది. ఈ సభలో ఆ పార్టీ నాయకురాలు కవిత(kavitha) ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామని, విద్య, వైద్యం కోసం అవసరమైతే రూ.లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తామని తెలిపారు.

అలాగే రాజకీయాలు అంటే బూతులు తిట్టుకోవడం కాదని కవిత వ్యాఖ్యానించారు. రైతులకు నీళ్లు, ఎరువులు, కరెంట్‌ అందడం లేదని ఆరోపించారు. రైతులకు నీళ్లు అందించే విషయంలో ప్రభుత్వానికి సరైన ఆలోచన లేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు