‘ఎల్ కాంగో’తోనే ముప్పు!

21-09-2026 | 05:05am
  1. ఎల్ నినోతో అప్పుడప్పుడు సమస్య
  2. కాంగ్రెస్ పాలనలో నిత్యం నష్టాలే 
  3. ప్రజా సమస్యలు వదిలి, ప్రైవేట్ ఆస్తుల చుట్టూ ప్రదక్షిణలా? 
  4. శోభారెడ్డి ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
  5. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : తెలంగాణ(Telangana)లో ‘ఎల్ నినో’ కంటే కాంగ్రెస్ ‘ఎల్ కాంగో’నే ఎక్కువ నష్టం చేస్తుందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(BRS General Secretary RS Praveen Kumar) విమర్శించారు. ఎల్ నినో(El Nino) అప్పుడప్పుడు వస్తే ‘ఎల్ కాంగో(El Congo)’ మాత్రం ప్రజలను నిత్యం ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు.ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. బీఆర్‌ఎస్ నేతల ప్రైవేట్ ఆస్తుల(Private property) చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

అజీజ్‌నగర్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)కు చెందిన ప్రైవేట్ ఆస్తుల వద్దకు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అద్దంకి దయాకర్ పోలీసు బందోబస్తుతో వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు.  రాజకీయ నాయకుల ప్రైవేట్ ఆస్తులపైకి వెళ్లేందుకు చట్టం అనుమతిస్తుందా.. డీజీపీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు ముందుగానే కార్యాచరణ ప్రకటించి, వందలాది మందితో వెళ్లినా పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.

అక్రమ ఆస్తులు సంపాదించారని అనుమానం ఉంటే రెవెన్యూ, సర్వే, పోలీస్, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా విచారణ చేయించాలనే తప్ప.. కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లడం దేనికని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్నది బీఆర్‌ఎస్ నాయకుల ప్రైవేట్ ఆస్తులపైకి వెళ్లడానికేనా? అని నిలదీశారు. ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో అన్యాయంగా భూములు చేర్చి పేదలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో ఎక్స్ సర్వీస్‌మన్‌కు సంబంధించిన భూమి అక్రమంగా మరో వ్యక్తి పేరుపైకి మార్చారని ఆరోపించారు.

1978కు సంబంధించిన లింక్ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌లో ఉపయోగించారని, అది ఇతరులకు చెందిన పత్రంగా ఉందని, వీటిపై రెవెన్యూ మంత్రి అసెంబ్లీలో ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదన్నారు. నాదర్‌గుల్ భూముల వ్యవహారాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్‌ఎస్ నేతల ఫామ్‌హౌస్‌ల చుట్టూ తిరగడం మాని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని.. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అంశాలు, రైతుల సమస్యలపై ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడాలని హితవు పలికారు. అంతేకాకుండా ఎంపీ లాడ్స్ నిధులను నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. 

ఆ వ్యక్తి ఎవరు?

శోభారెడ్డి అనే మహిళకు ప్రకటన ఇ ప్పిస్తానంటూ ముఖ్యమంత్రి సన్నిహితుడిగా చెప్పబడుతున్న వ్యక్తి గెస్ట్‌హౌస్ కు రావాలని కోరినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారని తెలిపారు. గెస్ట్‌హౌస్ ఎవరిదో, ఆమెను పిలిచిన వ్యక్తి ఎవరన్నదానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ప్రవీణ్‌కుమార్ డిమాం డ్ చేశారు.  శోభారెడ్డి ఆరోపణలపై స మగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు.

పోలీసు వాహనాలు, సీసీ కెమెరాలు తదితర మౌలిక వసతులపై కేం ద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు. బీఆర్‌ఎస్ నేతల ప్రైవేట్ ఆస్తుల వద్దకు వెళ్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కాం గ్రెస్ ప్రయత్నిస్తుండగా, బీఆర్‌ఎస్ మా త్రం ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యల పై పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులను  అడ్డుకుంటున్నట్లే కాంగ్రెస్ నేతలను కూడా అడ్డుకోవాలని డీజీపీని కోరారు. 

మరిన్ని వార్తలు