7 September, 2026 | 6:08 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

07-09-2026 | 05:05am

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన టీఆర్పీ అధినేత  

హైదరాబాద్, సెప్టెంబర్ 6(విజయక్రాం తి): ఉమ్మడి వరంగల్ జిల్లా, మహేశ్వరం ని యోజకవరాలకు చెందిన పలువురు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో (Telangana Rajyadhikari Party)చేరారు. ఆదివా రం హైదరాబాద్‌లోని టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ అ ధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీఆర్పీ లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన మామిడి శెట్టి రాజ్ కుమార్, మామిడి శెట్టి అశోక్ కుమార్, బొల్లం ప్రణయ్, తోటకూర కార్తీక్, శ్రీరామ్, కార్తీక్, అశోశ్‌లు టీఆర్పీలో చేరారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడు తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతను కేంద్ర ంగా చేసుకొని ముందుకు సాగుతున్న పార్టీ అని అన్నారు. రాష్ట్ర యువత ఆశయాలు, ల క్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ సి ద్ధాంతాలు, కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ కార్యక్ర మంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జల్పల్లి అభివృద్ధిని విస్మరించారు

మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీలో టీఆర్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మైనార్టీలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ జల్పల్లి ప్రజలు కనీస మౌలిక వసతుల లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార, స్థానిక ఎమ్మెల్యేగా, మాజీ మం త్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి జల్పల్లి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.గతంలో కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానా న్ని విస్మరించారని మండిపడ్డారు.

మైనారిటీ ల అభివృద్ధి, జల్పల్లి ప్రజల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం టీఆర్పీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని మల్ల న్న స్పష్టం చేశారు.  కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురా లు పటేల్ వనజక్క, జిల్లా అధ్యక్షులు బండారు రమేష్ యాదవ్, ఎంబీటీ స్పోక్స్ పర్సన్ అంజద్ ఉల్లా ఖాన్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ కొట్టే, పార్టీ నాయకురాలు విజయలక్ష్మి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు