బాధితుడి కోసం నిమ్స్‌కు ఎమ్మెల్యే

28-09-2026 | 03:20pm

నిమ్స్‌లో చికిత్సకు చొరవ.. ఎల్‌వోసీ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని హామీ

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం చిలకనగర్ డివిజన్‌కు చెందిన పొన్నబోయిన లక్ష్మణ్ తీవ్ర బ్రెయిన్ ట్యూమర్(Brain tumor) సమస్యతో నిమ్స్ ఆస్పత్రి(NIMS Hospital)లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshma Reddy) స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని గుడి మధుసూదన్ రెడ్డి ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులను కలిసి లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి: పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరం

అనంతరం నిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి రోగికి అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం నుంచి లభించే ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)తో పాటు అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన బండారి లక్ష్మారెడ్డి వారికి ధైర్యం చెప్పారు. క్లిష్ట సమయంలో ఎమ్మెల్యే స్వయంగా ఆస్పత్రికి వచ్చి స్పందించడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు