బాలాపూర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు

21-09-2026 | 05:15am

సినీ నటుడు విజయ్ దేవరకొండ, బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్.రామచందర్ రావు దర్శనం

 బడంగ్పేట్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): బాలాపూర్ గణనాథుడి(Balapur Ganapath)ని ఆదివారం నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(Ramachander Rao) వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు ని ర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమి టీ అధ్యక్షులు కళ్ళెం నిరంజన్ రెడ్డి, సామ బాబుల్ రెడ్డి నాయకులను, నటుడిని శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజే శారు.

అనంతరం రామచందర్ రావు బడంగ్పేట్ శ్రీ వీరాంజనేయ భక్త సమాజ గణప తిని కూడా దర్శించుకున్నారు.ఆదివారం కా వడంతో బాలాపూర్ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివ చ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 నాదర్గుల్లో రూ.1.71 లక్షలకు లడ్డూ వేలం...

నాదర్గుల్ పీఎంఆర్ కాలనీలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో ప్రిజమ్ కన్స్ట్రక్ష న్స్ అధినేతలు (వల్లపు ప్రవీణ్ యాదవ్, ఎంపలా ప్రణీత్ రెడ్డి) రూ.1,71,000లకు ల డ్డూను దక్కించుకున్నారు. అలాగే పవిత్ర శాలువాను రూ.66,666లకు ముద్ద వెంకట్ రెడ్డి దక్కించుకోగా, విజేతలను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.

మరిన్ని వార్తలు