జర్నలిస్టుల పింఛన్ కోసం సీఎంతో మాట్లాడుతా

25-11-2026 | 07:48pm

కడియం శ్రీహరి

జనగామ నవంబర్ 25 (విజయక్రాంతి): అర్హులైన జర్నలిస్టులకు పింఛన్ పథకం వర్తించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) హామీ ఇచ్చారు. రఘునాథపల్లి మండలం నీడిగొండలో జర్నలిస్టుల కోసం జర్నలిస్టులు కార్యక్రమంలో భాగంగా తెలుగు ప్రభ జనగామ స్టాఫ్ రిపోర్టర్ సుంకరి బిక్షపతి నేతృత్వంలో జర్నలిస్టులు కడియం శ్రీహరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జర్నలిస్టులకు పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలిసిన వారిలో జర్నలిస్టు సంఘాల నాయకులు ఇర్రి మల్లారెడ్డి, సాక్షి బిక్షపతి, పి.వెంకటస్వామి, తిప్పారపు ఉపేందర్, బూస రమేష్ యాదవ్, భాస్కర్, కుంభం రమేష్ యాదవ్, కిరణ్, సాగర్, సాయి, సుధాకర్, ఉపేందర్, రాజేష్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు