కొనసాగుతున్న పంట నష్ట నివారణ సర్వే

25-11-2026 | 07:10pm

బోథ్ నవంబర్ 25 (విజయక్రాంతి): సోనాల మండలంలో పంట నష్ట నివారణ సర్వేను చేపడుతున్నారు బుధవారం వ్యవసాయ అధికారి దేవా నాయక్(Agriculture Officer Deva Naik) మండలంలోని ఘనపూర్ గ్రామానికి వెళ్లి సర్వే నిర్వహించడం జరిగింది. అంతేగాక గ్రామ సర్పంచ్ ఉమాదేవి సమక్షంలో రైతులకు పలు వివరాలు తెలిపారు. నేల సంరక్షణపైన రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది. పంట వ్యర్థాలను కాల్చవద్దని వాటిని కలియ దున్నితే ఎరువుగా మారుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్ ఏఈఓ ఉమా ఉన్నారు.

మరిన్ని వార్తలు