హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

25-11-2026 | 07:43pm

ఎస్సై మధుకర్   

మంగపేట, నవంబర్ 25 (విజయక్రాంతి): నవంబర్ 28న జిల్లాలోని పస్రాలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న హెల్త్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంగపేట ఎస్సై బుదార్తి మధుకర్(SI Budarthi Madhukar) ప్రజలకు సూచించారు.

మండలంలోని పలు అటవీ గ్రామాలలో, గొత్తికోయగూడెంలలో మంగపేట ఎస్సై మధుకర్ తమ సిబ్బందితో కలిసి బుధవారం పర్యటించి ప్రజలకు హెల్త్ క్యాంపు గురించి అవగాహన కల్పించారు. క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు, మందులు, వైద్యుల సలహాలు అందజేస్తారని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులు, మహిళలు, పిల్లలు తప్పనిసరిగా క్యాంపుకు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై మధుకర్ ఈ సందర్భంగా సూచించారు.

మరిన్ని వార్తలు