ఫిర్యాదు చెబితే చాలు.. కేసు రెడీ
హైదరాబాద్: పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే సరికొత్త విధానం అందుబాటులోకి రానుంది. నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్గా (AI Police Station) తీర్చిదిద్దారు. ఈ వినూత్న పైలట్ ప్రాజెక్టును పరిశీలించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ (Artificial Intelligence) వ్యవస్థ పనితీరును స్వయంగా పరిశీలించారు.
ఈ ఏఐ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే.. ఫిర్యాదు చేయడానికి బాధితులు పోలీస్ అధికారుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఏఐ యంత్రం ముందు తమ సమస్యను వివరిస్తే చాలు.. వెంటనే ఫిర్యాదు నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా ఫిర్యాదు కాపీ కూడా ఆటోమేటిక్గా (Automatic) సిద్ధమవుతుంది. అనంతరం ఆ ఫిర్యాదు సంబంధిత పోలీస్ అధికారులకు చేరుతుంది.
పోలీస్ వ్యవస్థలో సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఏఐ పోలీసింగ్ విధానం భవిష్యత్తులో పోలీస్ సేవల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి.