బెజ్జూర్ మాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడి ఎన్నిక

25-11-2026 | 07:05pm

బెజ్జూర్, నవంబర్ 25 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల మాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ (New Committee) ఎన్నికలు మాలి కుల పెద్దలు, యువకులు, సంఘ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా ఆదే అశోక్ రెండోసారి ఏకగ్రీవంగా (Unanimously) ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమానికి మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదే వసంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదే నాందేవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్లే శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్రంగి రామకృష్ణ, కాగజ్‌నగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు నికాడి బాపురావు హాజరయ్యారు. వివిధ గ్రామాలకు చెందిన మాలి కుల పెద్దలు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు.

  • అధ్యక్షుడు: ఆదే అశోక్

  • ఉపాధ్యక్షులు: కావిడే గోపాల్, నికాడి మోహన్

  • ప్రధాన కార్యదర్శి: గుర్లే పోచన్న

  • కార్యదర్శులు: నికాడి మోహన్, చాటారి రాజు

  • కోశాధికారి: టాకిరే రణీత్

  • ప్రచార కార్యదర్శి: నికురి అంజన్న

  • సలహాదారు: కావిడే సుగుణాకర్

  • కార్యవర్గ సభ్యులు: గుర్లే అంజయ్య, చాటారి గణపతి, సండే పురుషోత్తం, నికాడి కుమార్, మోర్లే భీమయ్య తదితరులు.

మరిన్ని వార్తలు