ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామం(Kancharla village)లో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి(Mandal Congress President Narender Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యతతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణస్వామి యాదవ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.