జంతర్ మంతర్ ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం దుర్మార్గం

12-10-2026 | 11:11pm

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదు

నిరసనల ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వేదికలను కాపాడాలి

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్

దామరచర్ల: ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్‌(Jantar Mantar Dharna Chowk)ను ఎత్తివేయడం నిరసనలకు ఆంక్షలు విధించడం దుర్మార్గమైన చర్య అని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్(BC JAC State Convener Jajula Lingam Goud) తీవ్రంగా ఖండించారు. దామరచర్ల లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ(Democratic system)లో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు,తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు ధర్నా చౌక్‌లు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) అనేక ప్రజా ఉద్యమాలకు, సామాజిక న్యాయ పోరాటాలకు,వివిధ వర్గాల హక్కుల సాధనకు వేదికగా నిలిచిందని అలాంటి ప్రజాస్వామ్య వేదికను తొలగించడం లేదా నిరసనలకు అడ్డంకులు సృష్టించడం ప్రజల భావప్రకటన స్వేచ్ఛను,నిరసన తెలిపే హక్కును దెబ్బతీయడమేనని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజల గొంతుకను వినాల్సింది పోయి,వారి నిరసనలకు వేదికలు లేకుండా చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

మరిన్ని వార్తలు