కబడ్డీ జాతీయ స్థాయి క్రీడలకు ఇద్దరు విద్యార్థినిల ఎంపిక

12-10-2026 | 11:33pm

తాడ్వాయి,(విజయక్రాంతి): జాతీయ స్థాయి కబడ్డీ క్రీడలకు ఇద్దరు విద్యార్థినిలు ఎంపికైనట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్(Kabaddi Association) ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజన్న తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల వేములవాడ పట్టణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల్లో సబ్ జూనియర్ అండర్ 16 లో కామారెడ్డి పట్టణానికి చెందిన రిషిక జాతీయ స్థాయి కబడ్డీ క్రీడలకు  ఎంపికైనట్లు తెలిపారు.

రిషిక కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి సరస్వతీ శిశు మంది(Sri Saraswati Shishu Mandir)లో విద్యాభ్యాసం చేస్తుంది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడల(State level Kabaddi games)లో జూనియర్ విభాగంలో అండర్ 20 లో గాంధారికి చెందిన ఉష ఎంపికైనట్లు ఆయన తెలిపారు.ఈమె ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుందన్నారు. ఇద్దరు క్రీడాకారులు జాతీయ స్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపిక కావడం పట్ల కబడ్డీ జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు