ఎన్నికల అధికారికి ఘనంగా సన్మానం

11-10-2026 | 09:35pm

లింగాపూర్ (విజయక్రాంతి) అక్టోబర్ 11: రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి నూతవత్ శంకర్ నాయక్(Nuthavat Shankar Naik), ఆయన భార్య నిర్మల దంపతులను ఆదివారం లింగాపూర్ మండల(Lingapur Mandal) కేంద్రంలో ఘనంగా సన్మానించారు. మండల ప్రజలు, ఏఐబీఎస్ఎస్ నాయకులు(AIBSS leaders), ప్రజాప్రతినిధులు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏఐబీఎస్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రాథోడ్ భీంరావు మాట్లాడుతూ, లింగాపూర్ మండలం పిక్ల తండాకు చెందిన నూతవత్ శంకర్ నాయక్ రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవిని చేపట్టడం తమ సమాజానికి గర్వకారణమని అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఇంతటి ఉన్నత బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆయనను చూసి యువత స్ఫూర్తి పొందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ నాయకులు రాథోడ్ నారాయణ, యశ్వంత్ రావు, శేఖర్, సర్పంచ్ జాదవ్ శేఖర్, గ్రామ నాయక్ రాథోడ్ కిరణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాదవ్ రమేష్, మాజీ జడ్పీటీసీ విషంబార్, ఆడే లఖ్యనాయక్, రాంచందర్, పవర్ సంతోష్, జాదవ్ నాను, బానోత్ హసీరామ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు