ఉచిత కంటి వైద్య శిబిరం
లక్ష్మీదేవిపల్లి,(విజయక్రాంతి): లక్ష్మీదేవి పల్లి మండలం(Lakshmidevipalli Mandal) రేగళ్ల తండా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో శనివారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని(Lions Club Palvancha Kinnerasani) ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ చేపూరి బ్రహ్మచారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ ఐ హాస్పిటల్ వైరా వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం(Free Eye Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ డాక్టర్ బి సుధాకర్ రావు (శ్రీ సాయి సుధా హాస్పిటల్ పాల్వంచ) ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని,అందులో భాగంగా కిన్నెరసాని లయన్స్ క్లబ్ జి ఎల్ టి గా,లయన్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగిందనారు. ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించిన లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాపా మురళి కృష్ణ, లయన్ GMT డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, సీనియర్ ఆప్తోల్మజిస్ట్ లయన్ ఉండ్రు శ్యాంబాబు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కంటి వైద్య శిబిరాన్ని పంచాయతీ ప్రజలు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటుకు కారణమైన క్లబ్ ప్రసిడెంట్ లయన్ చేపూరి బ్రహ్మచారి ని లయన్ మాడిశెట్టి రాజ మనోహర్ లను అభినందించారు. అదే విధంగా రేగళ్ల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బి పూర్ణచంద్ మాట్లాడుతూ.. పంచాయతీలో లయన్స్ క్లబ్ వారు ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
ఈ కార్యక్రమాన్ని మా పంచాయతీలో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఆశ్రమ పాఠశాల రేగళ్ల తండా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా విద్యార్థులకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ఉచితంగా పిల్లలకు కంటి పరీక్షలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కంటి వైద్య శిబిరములో పాఠశాల విద్యార్థులు 90 మంది, గ్రామస్తులు 80 మంది మొత్తం 170 మంది కి ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది వారిలో 15 మందికి కంటి ఆపరేషన్లు లయన్స్ ఐ హాస్పిటల్ నందు చేయడం జరుగుతుంది.
మిగిలిన అవసరమైన వారికీ కళ్ళజోళ్ళు చుక్కల మందులు పంపిణి చేయడం జరిగిందని ఐ డాక్టర్ రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమం లో జోన్ 3,జోన్ ఛైర్పర్సన్ లయన్ కేదారేశ్వరరావు, లయన్స్ క్లబ్ పాల్వంచ కిన్నెరసాని ట్రెజరర్ లయన్ మాడిశెట్టి రాజ మనోహర్, క్లబ్ జి ఎస్ టి ఏమ్ డి రంజాన్, లయన్స్ క్లబ్ పాల్వంచ పవర్ ప్రెసిడెంట్ చావా రమణ, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎమ్, గుగులోత్ హరి ఆశ్రమ పాఠశాల డీప్యూటీ వార్డెన్ గుగులోత్ రవి,పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.