కరువు పరిస్థితులపై అఖిల సమావేశం ఏర్పాటు చేయాలి: జూలకంటి

04-10-2026 | 09:20pm

దామరచర్ల అక్టోబర్ 4: ఖరీఫ్ సీజన్ లో రాష్ట్రంలో వేల ఎకరాలలో వేసిన వరి పత్తి తదితర వాణిజ్య పంటలకు నీరంధక ఎండిపోతున్నాయని, వాటిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(CPM leader Julakanti Ranga Reddy) కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఎండిపోతున్న వరి పంటలను చూసి చెల్లించిపోయారు. రైతులు ఎండిన తమ  పొలాలలో పశువులను మేపటం రైతు ప్రతినిధి బృందంతో వెళ్లిన ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ ప్రభావం వల్ల రాష్ట్రంలో కోన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అఖిలపక్షం తో సమావేశంఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకోవాలని అదేవిధంగా రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రానికి తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు వారి సూచనలు తీసుకోవాలని తెలిపారు. 

రైతులు ఎకరాకు 20 నుండి 30 వేల రూపాయలు వెచ్చించి పంటలను సాగు చేశారని అందుకు ప్రైవేట్ వ్యాపారస్తుల నుండి అదనపు వడ్డీ చెల్లించి సాగు చేయటానికి ప్రయత్నించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పొలాలను చేలను అధికారుల బృందాన్ని పంపి పంట నష్టం అంచనా వేయాలని తగిన నష్టపరిహారం అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. దామరచర్ల మరికొన్ని ప్రాంతాలలో ఎక్కువ హరిజన గిరిజన రైతులే పంటలు వేశారని వారికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు.

అందుకు ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ ఎడమకాల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని తద్వారా కొంత మేరకు రైతులకు ఉపశమనం కలుగుతుందని ఆయన సూచించారు. అదేవిధంగా ఆయకట్టు ప్రాంతంలో ఉన్న చెరువులు కూడా సాగర్ నీటితో నింపితే అటు తాగునీటి ఇటు సాగునీటి సమస్య కూడా పరిష్కారమవుతుందని దాంతో పాటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. రైతులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారి వెంట సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు సిపిఎం నాయకులు వినోద్ నాయక్ దయానంద్ వీరకోటిరెడ్డి ఎర్రనాయక్ రైతులు ఉన్నారు.

మరిన్ని వార్తలు