విభిన్న సామర్థ్యం గల వ్యక్తులకు పరికరాలు అందజేత
కొత్తపల్లి, అక్టోబర్ 29(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం(Karimnagar town) లోని లయోల మహిళా కళాశాలలో(Loyola Women's College) ప్రాంగణంలో పాతిమానగర్ అడోరేషన్ సొసైటీ (Adoration Society)ఆధ్వర్యంలో విభిన్న సామర్థ్యం గల వ్యక్తులకు వీల్ చైర్, చేతి కర్రలు, పరికరాలు తణుకు మహేష్ డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ అందజేశారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ సిస్టర్ జిస్స మరియ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.సంస్థ ద్వారా శిక్షణ పొంది తమ సొంత కాళ్లపై నిలబడిన వ్యక్తులను చూస్తే అనందంగా ఉందన్నారు.వారు నెట్ వర్క్ గా మారి మిగతా వారికి శిక్షణ ఇవ్వడం చూస్తే సమాజం పట్ల వారికి ఉన్న భాద్యతలను గుర్తు చేస్తుందని చెప్పారు.
విభిన్న సామర్థ్యం గల వ్యక్తులకు కోసం పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.సంస్థ అందజేసే పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబానికి అండగా ఉండటం పట్ల హర్షం వ్యక్తంచేశారు.ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించారు.సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మిగతా వారికి మీరేమి తక్కువ కాదని ఎదైనా సాధించగలరు అనే నమ్మకంతో ముందుకు సాగలని కోరారు.ఈ కార్యక్రమంలో ,లయోల కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ కిరణ్, సిస్టర్ అరుణ,లీగల్ అడ్వైజర్ మహేష్,సంస్థ ప్రతినిధులు మర్రి మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి, రమేష్,రూప, స్రవంతి , మౌనిక, జమున,పద్మ, సరిత, విజయ తదితరులు పాల్గొన్నారు.