ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మహాదేవపూర్./కాళేశ్వరం అక్టోబర్ 2.(విజయక్రాంతి ): మండల కేంద్రంలో ఉద్యమకారులు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి అక్రముద్దీన్(Md. Akramuddin, Mandal President of the Activists' Forum) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని హై స్కూల్ గ్రౌండ్ లో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ అందించిన సేవలను కొనియాడారు అహింసా మార్గంలో ఆయన సాధించిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు.
గాంధీ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఈ సందర్భంగా మహాదేవపూర్ ఎస్సై ఎం సాంబమూర్తిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధికార ప్రతినిధి డాక్టర్ ఆయుబొద్దీన్ మండల ప్రధాన కార్యదర్శి కలికోట దేవేందర్,సీనియర్ ఉద్యమకారులు కారంగుల బాపురావు, జనగాం పోశం, పోత రమేష్, పెండ్యాల నరసింహస్వామి, తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.