కాంగ్రెస్‌కు రాజీనామా.. బీఆర్‌ఎస్‌లో చేరిక..
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి / చిట్యాల, అక్టోబర్ 01 ( విజయ క్రాంతి ) : చిట్యాల మండలం వెంచరామి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి (Congress Party)చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి స్థానిక సర్పంచ్ శ్రీమతి కాసు రమ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రైతులు, ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలయ్యాయని ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని పలువురు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ప్రస్తుతం రైతులకు విద్యుత్ సరఫరా, ఎరువుల లభ్యత తదితర సమస్యలు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో ప్రశ్నలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్నా గత ప్రభుత్వంపై విమర్శలు మాని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాబోయే రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వానికి ప్రజల నుంచి మరింత మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో జక్కె వెంకటేశం, మోరె ధర్మరాజు, కళ్లేపల్లి సదయ్య, చేటుకూరి అశోక్, గుర్రం అయిలయ్య, యూత్ ఉపాధ్యక్షులు తిప్పన శివ, ఆశాడపు మల్లయ్య, పరికిపండ్ల సమ్మయ్య, పరికిపండ్ల సాగర్, పరికిపండ్ల సంతోష్ తదితరులు ఉన్నారు.