ఎన్నికల కమిషనర్ ను తొలగించాలి

01-10-2026 | 03:39pm
  1. ఎస్ఐఆర్ ను వెంటనే నిలిపివేయాలి : సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సొతుకు ప్రవీణ్ కుమార్
  2. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా 

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 01 ( విజయక్రాంతి ) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, తొలగించబడిన అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను(Election Commissioner Gyanesh Kumar) వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సొతుకు ప్రవీణ్ కుమార్, గుర్రం దేవేందర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని, సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా పారదర్శకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తొలగించబడిన అర్హులైన ఓటర్ల పేర్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని, తొలగించిన ఓట్లపై సమగ్ర పరిశీలన నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు