రైతులకు గుడ్‌న్యూస్

01-10-2026 | 04:04pm

నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మండలంలోని ఎర్రారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐకెపి ఏపీఎం కొమ్మ దత్తు కొబ్బరికాయ కొట్టి కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఐకెపి ఏపీఎం కొమ్మ దత్తు మాట్లాడుతూ ఖరీఫ్ పంట వరి ధాన్యం కొనుగోలు కేంద్రం (PURCHASE CENTRE) ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు వరి పంటకు కనీస మద్దతు ధర పొందాలంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

వరి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, చెత్త, తాలు, మట్టి పెడ్డలు, రాళ్లు లేకుండా శుభ్రపరచి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. ఏ-గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర (MSP) రూ.2,461 కాగా, సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.2,441 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలతో (QUALITY STANDARDS) కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ (PURCHASE PROCESS)లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, ఎమ్మార్వో వెంకటరెడ్డి, జలాల్పూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ సాయిబాబా, ఏపీఎం దత్తు, మాజీ సర్పంచ్ జీవరత్నం, ఐకెపి వీవో అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి వెంకట్రాములు, జీపీఓ రవి, సీనియర్ అసిస్టెంట్ సుభాష్, సెంటర్ ఇన్‌చార్జి రాజు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు