మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ

25-09-2026 | 02:00pm

గణపురం,(విజయక్రాంతి): గణపురం మండలం(Ganapuram Mandal)లోని లక్ష్మారెడ్డిపల్లి, సీతారాంపురం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Former MLA Gandra Venkata Ramana Reddy) శుక్రవారం పరామర్శించారు. లక్ష్మారెడ్డిపల్లిలో ఎక్కటి సంజీవరెడ్డి, నల్ల రాజిరెడ్డి కుటుంబాలను, సీతారాంపురంలో ఓదెల బసవయ్య, రోడ్డు ప్రమాదం(Road accident)లో మృతి చెందిన ఆలయ అర్చకుడు సముద్రాల రాకేష్ కుటుంబాలను పరామర్శించారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ ఓదాకర్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు