మిత్రుడి కుటుంబానికి అండగా స్నేహితులు
24-09-2026 | 07:00pm
గణపురం,(విజయ క్రాంతి): గణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Ganapuram Zilla Parishad High School)లో 2007–08 విద్యా సంవత్సరంలో చదివిన స్నేహితులు తమ స్నేహబంధంతో మానవత్వాన్ని చాటుకున్నారు. బాగిర్తిపేటకు చెందిన పెండ్యాల అశోక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. అశోక్ మృతి విషయం తెలుసుకున్న అతని చిన్ననాటి మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే బాగిర్తిపేటలోని అశోక్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. చిన్ననాటి స్నేహాన్ని మరువకుండా మిత్రుడి కుటుంబం కష్టకాలంలో ఉన్న సమయంలో స్పందించిన 2007–08 విద్యా సంవత్సరపు స్నేహితులను గ్రామస్తులు అభినందించారు.