జిల్లాస్థాయి క్రీడల్లో మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

02-11-2026 | 05:11pm

కబడ్డీ, వాలీబాల్‌లో ప్రథమ బహుమతులు

రాష్ట్రస్థాయికి పలువురి ఎంపిక

గణపురం,(విజయక్రాంతి): భూపాలపల్లిలో అక్టోబర్ 30న అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి పీఎం శ్రీ పాఠశాలల క్రీడా పోటీల్లో గణపురం మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. కబడ్డీ బాలుర విభాగంలో, వాలీబాల్ బాలుర విభాగంలో ప్రథమ బహుమతులు సాధించగా, కబడ్డీ బాలికల విభాగంలో ద్వితీయ బహుమతి పొందారు.

లాంగ్ జంప్‌లో ఆర్. సిద్ధు ద్వితీయ స్థానం, షాట్‌పుట్‌లో బి. రామ్‌తేజ్ ప్రథమ స్థానం సాధించారు. ఆర్. సిద్ధు, బి. రామ్‌తేజ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కబడ్డీలో కే. శ్రావణ్, పి. సిద్ధులు కూడా రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థుల విజయాలపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు