రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
ఏఎంసి చైర్మన్ హామిద్
గంభీరావుపేట నవంబర్ 2 (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ హమీద్(Gambhiraopet AMC Chairman Hamid) అన్నారు. ఐకెపి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు నర్మాల జగదాంబ తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ హమీద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట, నర్మాల,జగదాంబ తండా సర్పంచులు మల్లుగారి పద్మ, రాజబోయిన అర్చన,బానోత్ రమేష్, సింగల్ విండో చైర్మన్ వేషాల వెంకటి,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సింగల్ విండో డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు, ఐకేపీ సీసీ లు,సిఎలు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.