పీఎం శ్రీ స్థాయి క్రీడాలో బొల్లారం విద్యార్థి ప్రతిభ
నాగిరెడ్డిపేట్,నవంబర్ 2 (విజయ క్రాంతి):కామారెడ్డి జిల్లాలో జరిగిన పీఎం శ్రీ స్థాయి క్రీడల్లో(PM Sri level sports) నాగిరెడ్డిపేట మండలం బోల్లారం విద్యార్థి ప్రతిభ కామారెడ్డి జిల్లాలో గత నెల అక్టోబర్ 30,31 తేదీలలో నిర్వహించిన పీఎంశ్రీ జిల్లా స్థాయి క్రీడల పోటీల్లో నాగిరెడ్డిపేట మండలం బోల్లారం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థి పి.వర్షిత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
ఈ విద్యార్థి చూపిన అద్భుత ప్రతిభకుగానూ నవంబర్ 5, 6 తేదీల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో కామారెడ్డి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.విద్యార్థి వర్షిత్ సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ,పాఠశాల వ్యాయామ పిడి సుకుమార్ గౌడ్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.గ్రామీణ ప్రాంత విద్యార్థి జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల వారంతా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, వర్షిత్‌ను ప్రత్యేకంగా అభినందించారు.రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా వర్షిత్ మరింత రాణించి పాఠశాలకు, నాగిరెడ్డిపేట మండలానికి మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.