మహాదేవపూర్‌లో తహశీల్దార్ కార్యాలయం, ఫైర్ స్టేషన్ ప్రారంభం
25-11-2026 | 06:43pm
భూపాలపల్లి, నవంబర్ 25 (విజయక్రాంతి): మహాదేవపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయ భవనం (Tehsildar Office), ఫైర్ స్టేషన్‌ను (Fire Station) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం ప్రారంభించారు.
రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు (Administrative Services) అందనున్నాయి. అత్యవసర సమయాల్లో అగ్నిమాపక సేవలు (Fire Services) వేగంగా అందించేందుకు ఫైర్ స్టేషన్ ఉపయోగపడనుంది.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మ, అడిషనల్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, తహశీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు.