డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం పాటు పడాలి

25-11-2026 | 06:32pm

మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి

మేడ్చల్ అర్బన్ నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి(BJP General Secretary Amaram Mohan Reddy) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతను పెడదారిన పడకుండా డ్రగ్స్ రహిత నిర్మాణ దేశంగా తీర్చి దిద్దాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.

నేటి సమాజంలో యువత డ్రగ్స్ కు అలవాటు పడి నష్ట పోతున్నారని మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.భారత దేశ వ్యాప్తంగా యువత డ్రగ్స్ మత్తులో బానిసలు కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చేపట్టిన డ్రగ్స్ రహిత నిర్మాణ దేశంగా భారత్ నిలవాలని కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు