తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం
మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి.
నేరేడుచర్ల, నవంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల పాలిటీ ప్రభుత్వం అని, మున్సిపాలిటీలో పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి(Municipal Chairman Konatham Chinna Venkat Reddy) అన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం అని, ప్రజా ప్రభుత్వం అని తెలియజేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ యూరావ లక్ష్మి, 5వ వార్డు కౌన్సిలర్ నన్నెపంగ శ్రీనివాస్, 9వ వార్డు కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, 10వ వార్డు కౌన్సిలర్ ఇంజమూరి వెంకటమ్మ, 11వ వార్డు కౌన్సిలర్ మేక్ ఫాహీన్, 12వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలీం మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు ఆలక శ్రవణ్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు షేక్ మొగల్బి, మాజీ చైర్మన్ బచ్చులకారి ప్రకాష్, మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.