సమయపాలన పాటించని విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి
ఖానాపూర్ (విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ విద్యాధికారి సమయపాలన పాటించడం లేదని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి అల్లేపు పీటర్, సహాయ కార్యదర్శి భూక్య సురేందర్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల సమస్యలను విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయానికి వస్తున్నా, అధికారి అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు.
ఈ మేరకు బుధవారం వారు విద్యాధికారి కార్యాలయానికి వెళ్లగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా అధికారి రాకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల అండతోనే ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమయపాలన పాటించని విద్యాధికారిపై చర్యలు (Action) తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కేంద్రంలో ఆందోళన (Protest) చేపడతామని హెచ్చరించారు.