నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

25-11-2026 | 06:30pm

సత్తుపల్లి నవంబర్ 25 (విజయక్రాంతి): సత్తుపల్లి మండలం రెజర్ల గ్రామ పంచాయతీకి చెందిన భీమిరెడ్డి పుల్లారెడ్డి కుమార్తె భీమిరెడ్డి గాయత్రి నిశ్చితార్థ వేడుకకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Matta Ragamayee Dayanand) హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే నూతన దంపతులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు