అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
16-10-2026 | 10:32pm
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం, అక్టోబర్ 16 (విజయ క్రాంతి): అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Bhupalpally MLA Gandra Satyanarayana Rao) అన్నారు. శుక్రవారం మండలంలోని చెల్పూర్ గ్రామంలో దుర్గామాత నవరాత్రి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐతె రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఘనపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.