జాతీయ స్థాయిలో రాణించాలని ఉంది
27-10-2026 | 07:21pm
అక్టోబర్ 27, నేరడిగొండ (విజయక్రాంతి ): జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో(National-level cricket tournament) రాణించాలని ఉందని విద్యావర్ధన్ అన్నారు. నేరడిగొండ మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఉద్యావర్ధన్ ఇటీవల నిర్మల్ జిల్లాలో నిర్వహించిన అండర్ 17 క్రికెట్ ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు.
ఈ నెల 27 నుంచి 29 వరకు జోగులాంబ జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటరమణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు విద్యావర్ధన్ ఎంపిక కావడంతో ఉపాధ్యాయ సిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.