మొబైల్‌ను అప్పగించిన ఎస్ఐ అశోక్

26-09-2026 | 03:54pm

గణపురం,(విజయ క్రాంతి): చెల్పూర్ గ్రామానికి చెందిన అవుల శంకర్, తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు గణపురం పోలీస్ స్టేషన్‌(Ganapuram Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఫోన్‌(mobile phone)ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను అవుల శంకర్‌కు గణపురం ఎస్ఐ బొరగల అశోక్ శనివారం తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు