కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

27-09-2026 | 07:10pm

నిర్మల్ సెప్టెంబర్ 27 ( విజయ క్రాంతి) : కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు(Konda Laxman Bapuji Birth Anniversary Celebrations) నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్(BC Welfare Department District Officer Srinivas) ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్పతనాన్ని వివరించారు. భారత స్వాతంత్రం ఉద్యమం(Indian Independence Movement), నిజాం వ్యతిరేఖ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో(Telangana movement) కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. వృద్ధాప్యంలో కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన గొప్ప ఉద్యమకారుడు అని వివరించారు.

ఈ జయంతి వేడుకల్లో భాగంగా పలువురు సంఘాల నాయకులు మాట్లాడుతు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను మనమందరం ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ  సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు