జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కమిటీలో మణుగూరు సభ్యులకు చోటు
మణుగూరు, సెప్టెంబర్ 28,(విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పెద్దమ్మగుడి సమీపంలోని అంబికా ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం(District Reddy Welfare Association) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని(New District Committee) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జమ్ముల సీతారామిరెడ్డి, కార్యదర్శులుగా వై. శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా కళ్లెం వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు.
నూతన జిల్లా కమిటీలో మణుగూరు ప్రాంతానికి చెందిన ఉడుముల తిరుపతిరెడ్డి, శిరపు గణేష్‌రెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, ఆలేటి అశోక్‌రెడ్డి, సానికొమ్ము వెంకటేశ్వర్‌రెడ్డి (బీఎస్‌ఎన్‌ఎల్), శ్యామలకొండా రెడ్డి, సరెడ్డి రాఘవరెడ్డి, బద్దం శ్రీనివాసరెడ్డి, దేవిరెడ్డి ఆదిరెడ్డి తదితరులకు స్థానం లభించింది. ఏడూళ్ల బయ్యారం నుంచి గంగిరెడ్డి వెంకటరెడ్డి, ముక్కు వెంకటేశ్వర్‌రెడ్డి, కోటపాటి సుబ్బారెడ్డి, బత్తుల వెంకటరెడ్డి, ముక్కు వెంకటేశ్వర్‌రెడ్డి (లారీ), గట్ల బాల్‌రెడ్డి తదితరులను కమిటీలోకి ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మణుగూరు రెడ్డి సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు నాసిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, కార్యదర్శి ఆలేటి అశోక్‌రెడ్డి, కోశాధికారి గాయం అవినాష్‌రెడ్డి, కమిటీ సభ్యులు సామ శ్రీనివాసరెడ్డి (రైస్‌మిల్), ఆదినారాయణరెడ్డి, సారంపల్లి రామ్‌రెడ్డి, బంక్ శ్రీనివాసరెడ్డి, యాకుబ్‌రెడ్డి, లాయర్ రమణారెడ్డి, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.