కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

21-09-2026 | 05:01pm

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం బాపూజీ చేసిన కృషి, త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. క్యాతం సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల కోసం పదవులు ఉండాలనే సందేశాన్ని బాపూజీ తన జీవితంతో చాటిచెప్పారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు.ఈ

కార్యక్రమంలో భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు, చిట్యాల మండల అధ్యక్షులు, పద్మశాలి సంఘం నాయకులు భాగవతం బిక్షపతి, సేరు కుమారస్వామి, దాసరి సుదర్శన్, కుసుమ కృష్ణమోహన్, పాసికంటి శ్రీనివాస్, గుండా వీరస్వామి, పుల్లె రాజేశం, ఎల్ల శంకర్, పేరాల వెంకటేశం, బొద్దుల శంకర్, మావిడాల రవీందర్, దుంప నర్సయ్య, బూర ప్రవీణ్, కొలిపాక శ్రీనివాస్, వంగ కుమారస్వామి, కొలిపాక ప్రసాద్, కుసుమ చంద్రశేఖర్, మామిడి శ్రీకాంత్, కొండి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు