వి బి జి రాంజీ పథకం కింద ఉపాధి పనులు వేగవంతం చేయండి

17-10-2026 | 07:20pm

బోథ్. అక్టోబర్ 17 ( విజయక్రాంతి): ఉపాధి హామీ పనులను(Employment guarantee works) వేగవంతం చేయాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు(Sonala MPDO Ratnakar Rao) కోరారు. శనివారం వివిధ గ్రామాలలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో నీటి నిలువ ఉండే విధంగా పనులు చేపట్టాలన్నారు.

భవిష్యత్తులో నీటి ఎద్దడి ఎదురయ్యే ఆస్కారం ఉన్నందున ఇంకుడు గుంతల నిర్మాణం అన్ని గ్రామాల్లో చేపట్టాలన్నారు. కూలీలకు ఉపాధి లభించడంతోపాటు భూగర్భ జలాల పెంపు కోసం ముందస్తుగా ప్రణాళికలు చేపట్టాలని కోరారు. అన్ని గ్రామాలలో పనులు జరిగే విధంగా సిబ్బంది కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులు ఉన్నారు.

మరిన్ని వార్తలు