చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

17-10-2026 | 07:34pm

నిర్మల్ అక్టోబర్ 17 ( విజయక్రాంతి): ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల(Kalyana Lakshmi and Shadi Mubarak schemes) ద్వారా సాయం అందిస్తోందని ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌(Mudhol MLA Pawar Ramarao Patel) అన్నారు. కుబీర్‌ మండలంలోని రైతువేదికలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ పథకాల కింద అర్హులైన 102 మంది లబ్ధిదారులకు(Beneficiaries) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు గ్రామాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచులకు సూచించారు.

24 గంటల పాటు బోర్లు నడిచే గ్రామాల్లో సమయపాలన విధించి నీటిని పొదుపుగా వినియోగించేలా చూడాలన్నారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా పొలాల్లో నీటి కుంటలు, ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు