మద్యం రహిత గ్రామంగా కాశపురం

16-10-2026 | 10:55pm

మద్యం విక్రయిస్తే రూ.20 వేల జరిమానా..

సమాచారం ఇచ్చిన వారికి రూ.2 వేల బహుమతి

అలంపూర్  అక్టోబర్ 16 : జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) అలంపూర్ మండలం కాశపురం గ్రామాన్ని మద్యం రహిత గ్రామంగా(Alcohol-free village) తీర్చిదిద్దాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ మేరకు శుక్రవారం సర్పంచ్ మద్దిలేటి, ఉప సర్పంచ్ ఖాజా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.20,000 జరిమానా విధించాలని, మద్యం అమ్మకాలపై(liquor sales) సమాచారం ఇచ్చిన వారికి రూ.2,000 బహుమతి అందించాలని తీర్మానించారు. మద్యం వల్ల కుటుంబాలు, ఆరోగ్యాలు, యువత భవిష్యత్తు దెబ్బతింటున్న నేపథ్యంలో గ్రామాన్ని మద్యానికి దూరంగా ఉంచేందుకు గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవనుంది.

మరిన్ని వార్తలు