పంట వివరాల నమోదుపై ఏఈఓ దత్తేశ్వరి ఫోకస్
10-09-2026 | 03:10pm
బాన్సువాడ, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని(Banswada Mandal) చిన్న రాంపూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను దేశాయిపేట ఏఈఓ దత్తేశ్వరి గురువారం పరిశీలించారు. గ్రామంలో పంట పొలాలను సందర్శించి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈఓ దత్తేశ్వరి మాట్లాడుతూ సర్వే నెంబర్ల వారీగా పంటల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా నమోదు చేయాలని వాలంటీర్లకు సూచించారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయడంతో పాటు, సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంటల వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో సక్రమంగా నమోదయ్యేలా సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు.