విద్యా శాఖ ఆధ్వర్యంలో పరీక్ష
27-09-2026 | 06:54pm
నిర్మల్, సెప్టెంబర్ 27 ( విజయ క్రాంతి) : జిల్లా విద్యాశాఖ(District Education Department) ఆధ్వర్యం లో ఆదివారము నాడు నిర్మల్ జిల్లా(Nirmal District) వ్యాప్తంగా ఉల్లాస్ (FLN) పరీక్ష, నిర్వహించారు. MEPMA & DRDA (సెర్ప్ ) మరియు వయోజన విద్యాశాఖ(Department of Adult Education) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున, ఇందులో భాగంగా నిర్మల్ పట్టణంలోని సాయి నగర్, YSR నగర్ కేంద్రంలోని FLN పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న సందర్శించారు. జిల్లా ఇంఛార్జి అధికారి (ఉల్లాస్), వయోజన విద్యా శాఖ - నిజామాబాద్, CMO N.ప్రవీణ్ కుమార్ DPM శోభారాణి TMC సావిత్రి మరియు సిబ్బంది కృషి అభినందనీయం.