ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించిన అనుదీప్‌కు సన్మానం

12-09-2026 | 10:24pm

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

దోమకొండ,(విజయక్రాంతి): ఆర్చరీ క్రీడలో(Archery sports) ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధించిన ఎం. అనుదీప్‌ను శనివారం దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఆర్చరీ జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్చరీ జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్(Archery District President Teegala Thirumal Goud) మాట్లాడుతూ.. ఈ నెల 6న కొల్లూరులోని ఢిల్లీ పబ్లిక్ పాఠశాలలో(Delhi Public School) నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో ఎం. అనుదీప్ ప్రతిభ కనబరిచి రికర్వ్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించినట్లు తెలిపారు.

అనుదీప్ అక్టోబర్ 21 నుంచి 23 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటి దోమకొండకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్చరీ కార్యదర్శి మోహన్ రెడ్డి, సలహాదారులు పిన్నం రామచంద్రం, ఆర్చరీ కోచ్ ప్రతాప్ దాస్, విండో డైరెక్టర్లు రాములు, నంబర్ రాములు, మహమ్మద్ శివరాం, మందిర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండ అంజన్, ఎల్లం నయీమ్, ఆర్చరీ జాతీయ క్రీడాకారిణి కదిరే సింధుజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు